విశాఖలో వివాహేతర సంబంధం: ప్రొఫెసర్ హత్య

నగరంలో పిఠాపురం కాలనీకి చెందిన సాయికుమార్ అనే మెడికల్ రిప్రజెంటేటివ్ భార్య కూడా అదే కళాశాలలో పనిచేస్తోంది. కొంతకాలంగా ఆమెతో కిషోర్ సన్నిహితంగా మెలుగుతున్నారు. దీంతో ఆమె భర్త సాయికుమార్ అనుమానించేవాడని తెలిసింది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి తెన్నేటిపార్కుకు రావాల్సిందిగా సాయికుమార్ నుంచి కిషోర్‌కు ఫోన్ వచ్చింది. రాత్రి 7 గంటల సమయంలో పనుందని చెప్పి ఇంటి నుంచి ద్విచక్రవాహనంపై కిషోర్ పార్కుకు వెళ్లాడు. రాత్రి పదిగంటలవుతున్నా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది ఫోన్ చేశారు.
పార్కులో ఉన్నానని, అర్ధగంటలో వస్తానని చెప్పడంతో ఊపిరిపీల్చుకున్నారు. రాత్రి 11 గంటలవుతున్నా కిషోర్ రాకపోవడంతో మరోమారు ఫోన్ చేయగా స్పందన కరువైంది. వెంటనే కుటుంబ సభ్యులు తెన్నేటిపార్కుకు వెళ్లి చూడగా ద్విచక్ర వాహనం కనిపించింది. అతని ఆచూకీ లేకపోవడంతో అనుమానం కలిగి పిఠాపురంకాలనీలో నివసిస్తున్న కుమార్ ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో అతని భార్య శిరీష మాత్రమే ఉంది. భర్త ఫోన్ చేసినంత మాత్రాన కిషోర్ ఎందుకు వెళ్లాడని, తనకూ ఆందోళనగా ఉందని శిరీష చెప్పింది. ఈ మధ్య కుమార్ ప్రవర్తనలో మార్పు వస్తోందంటూ ఆమె వారి వద్ద ఆందోళన వ్యక్తం చేసింది.












Click it and Unblock the Notifications