రాజీనామాలకు తెలంగాణ మంత్రులు రెడీ

తెలంగాణ మత్రుల రాజీనామాల అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి రోశయ్య వ్యతిరేకించారు. మంత్రులుగా ఉంటూ రాజీనామాలు చేస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆయన చెప్పినట్లు సమాచారం. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం ఏర్పడిన తర్వాత తెలంగాణకు సంబంధించిన అంశంపై ముందుకు సాగవచ్చునని ఆయన సూచించినట్లు తెలుస్తోంది. తెలంగాణకు చెందిన మంత్రులు గురువారం ఉదయం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ను కలిశారు. కాగా, హైదరాబాదుకు చెందిన మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్ మిగతా తెలంగాణ మంత్రులతో కొంత విభేదిస్తున్నారు.












Click it and Unblock the Notifications