ఆంధ్రజ్యోతి 'గవర్నర్- సెక్స్' క్లిప్స్ పై భిన్నాభిప్రాయాలు

గవర్నర్ ఎన్ డి తివారీ రాసలీలలను ఆంధ్రజ్యోతి చానల్ నేటి ఉదయం బయటపెట్టింది. సెక్స్ వర్కర్లను దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తెప్పించుకుని వారిని రాజ్ భవన్ లో తోటమాలీలుగా పెట్టుకుని వారితో 85 ఏళ్ల తివారీ రాసలీలలు సాగిస్తున్నట్టు సీక్రెట్ కెమెరాల ద్వారా ఈ చానల్ బయటపెట్టింది. నగ్నంగా గవర్నర్ గారు ఆ అమ్మాయిలను కూడా నగ్నంగా మార్చి మసాజ్, ఇతర పనులు చేయించుకుంటున్నట్టు ఈ క్లిప్స్ బయటపెట్టాయి. ఈ వార్త ఇప్పుడు రాష్ట్రంలోనే కాదు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ప్రాంతాల మధ్య పోరాటాల ద్వారా దేశమంతటా వార్తల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు గవర్నర్ రాసలీలల విషయంలోనూ ముందు ఉంది. రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడిన తరుణంలో ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత గల గవర్నర్ ఇలా వ్యవహరించడం విమర్శలకు దారి తీసింది.
గవర్నర్ తివారీ ద్వారా తనకో కొడుకు పుట్టాడంటూ ఒక యువతి కోర్టుకెక్కిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన కొన్ని స్టార్ హోటళ్ళలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొని బహిరంగంగా మందుకొడుతున్న వార్తలు కూడా బయటికి వచ్చాయి. కేంద్రానికి ఈ విషయంలో స్పష్టమైన సమాచారం అందిందని, ఎటూ ఆయనను మార్చి దిగ్విజయ్ సింగ్ ను కానీ ఉమన్ చాందీని కానీ నియమిస్తారని వార్తలు ఇంతకు ముందే వచ్చాయి. రాజ్ భవన్ ను అపవిత్రం చేసిన తివారీపై కొన్ని గంటల్లోనే వేటుపడే అవకాశముందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications