టిడిపి చేవెళ్ల ఎమ్మెల్యే ఆమరణ దీక్ష

కాగా, తెలంగాణ శాసనసభ్యుల రాజీనామాల పరంపర కొనసాగుతూనే ఉంది. గ్రేటర్ హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ కాంగ్రెసు శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి బుధవారం రాజీనామా చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలు కూడా తెలంగాణకు మద్దతుగా రాజీనామాలు చేస్తుండడం గమనార్హం. కాంగ్రెసు శాసనసభ్యులు బిక్షపతి యాదవ్, ఆకుల రాజేందర్, రాజిరెడ్డి కూడా శుక్రవారం తమ శాసనసభా సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. కుత్బుల్లాపూర్ శాసనసభ్యుడు కూన శ్రీశైలం రాజీనామా చేశారు.












Click it and Unblock the Notifications