సిఎంకు తెలంగాణ మంత్రుల రాజీనామాలు

రాజీనామాలు చేయవద్దని ముఖ్యమంత్రి చెప్పినా వారు వినలేదు. పార్టీ అధిష్టానం తెలంగాణకు సానుకూలంగానే ఉందని, అందువల్ల ఆవేశంతో, భావోద్వేగంతో రాజీనామా చేయకూడదని ముఖ్యమంత్రి చెప్పారు. రాజీనామాల వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని ఆయన అన్నారు. అయితే తమ ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని తాము రాజీనామా చేస్తున్నట్లు వారు తెలిపారు. ఫ్యాక్శ్ ద్వారా వారు రాజీనామాలను కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపనున్నారు. గురువారం రాత్రి మంత్రుల సమావేశానికి హాజరు కాని ముఖేష్ గౌడ్ శుక్రవారం ముఖ్యమంత్రిని కలిసినవారిలో ఉన్నారు. దానం నాగేందర్ కూడా ఈ మంత్రులతో ఉన్నారు.












Click it and Unblock the Notifications