బిజెపి జై తెలంగాణ పాట, జై ఆంధ్ర బాట

మంత్రులు దానం, ముఖేష్‌గౌడ్, ఎంఐఎం నేతలు కలిసి హైదరాబాద్‌ను తెలంగాణ నుంచి విడగొట్టడానికి కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా జనవరి 1న హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై పెద్ద ఎత్తున కాగడాల ప్రదర్శన నిర్వహించనున్నట్టు చెప్పారు. సోమవారం 24 చోట్ల నిరసన దీక్షలు, 29న నెక్లెస్ రోడ్డులో బతుకమ్మ ప్రదర్శన ఉంటుందని చెప్పారు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్, టీడీపీలు 'మాక్ ఫైటింగ్' చేస్తున్నాయని ఎద్దేవా చేశారు.
వైఎస్ ఉన్నప్పుడు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన మంత్రులు ఇప్పుడు అనుకూలమంటూ ప్రజలను మభ్యపెట్టజూస్తున్నారని ఆరోపించారు. సీఎం రోశయ్యకు కాళ్లలో బలం లేకపోయినా నిలబడడానికి ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం రాష్ట్రాన్ని బ్యూరోక్రాట్లే పాలిస్తున్నారన్నారు. తెలంగాణ అంశంపై పొరపాటయ్యిందంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ముక్కు నేలకు రాసి లెంపలేసుకుంటే ఆయన చిత్తశుద్ధిని ప్రజలు నమ్ముతారని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications