నాలుగైదు రోజుల్లో పరిష్కారం: డిఎస్

రాష్ట్ర విభజన సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడం మంచిదని, ఇరు ప్రాంతాల ప్రజల మధ్య రాగద్వేషాలు తలెత్తడం బాధాకరంగా ఉందని ఆయన అన్నారు. విద్యార్థుల ఉద్యమంలోకి అసాంఘిక శక్తులు ప్రవేశించే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. పోలీసులు హద్దు మీరవద్దని ఆయన సూచించారు. పోలీసులు అతిగా ప్రవర్తిస్తే ఆందోళనకారుల్లో ఆవేశం పెరుగుతుందని, అది మంచిది కాదని ఆయన అన్నారు. ప్రభుత్వ కార్యకలాపాలు యధావిధిగా సాగుతున్నాయని ఆయన చెప్పారు. వ్యక్తిగతంగా తాను తెలంగాణకు అనుకూలమైనప్పటికీ పార్టీ అధ్యక్షుడిగా అన్ని ప్రాంతాలవారికీ ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. అన్ని ప్రభుత్వ కార్యకలాపాలు సక్రమంగా సాగుతున్నాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications