31లోగా తెలంగాణపై మరో ప్రకటన

పార్టీలకు అతీతంగా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై స్పష్టత, నిర్దిష్ట కాలపరిమితి కోరుతూ ఆందోళనకు దిగాయి. తెలంగాణ కాంగ్రెసు నాయకులకు ఇటు తెలంగాణ రాష్ట్ర సమితి, తెలుగుదేశం పార్టీలు, అటు విద్యార్థులు ఊపిరి సలనీయడం లేదు. వారిని ఎక్కడికక్కడ నిలదీస్తూ ఉన్నారు. తెలంగాణ విషయంలో నీళ్లు నములుతున్న తెలంగాణ నాయకులందరినీ విద్యార్థులు నిలదీస్తున్నారు. దీంతో కాంగ్రెసు పార్టీ తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని గ్రహించిన కాంగ్రెసు అధిష్టానం మరో ప్రకటనకు పూనుకుంటున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు విధివిధానాలను ఖరారు చేస్తూ ఆ ప్రకటన వెలువడే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications