జార్ఖండ్ ముఖ్యమంత్రిగా శిబూ సొరేన్ ప్రమాణం

Shibu Soren
రాంచీ: జార్ఖండ్ ముఖ్యమంత్రిగా జెఎంఎం నేత శిబూ సొరేన్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. జార్ఖండ్ ఏడో ముఖ్యమంత్రిగా ఆయన పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. నిజానికి, సొరేన్ బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు మోరాబాదీ మైదానంలో ప్రమాణం చేయాల్సి ఉంది. అయితే ఆ కార్యక్రమాన్ని జ్యోతిష్య పండితుల సూచన మేరకు ఉదయం పదిన్నర గంటలకు మార్చుకున్నారు.

జార్ఖండ్ ముక్తి మోర్చా (జెఎంఎం) బిజెపి, అఖిల జార్ఖండ్ విద్యార్థి సంఘం మద్దతుతో జార్ఖండ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. గత తొమ్మిదేళ్లలో జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవిని సొరేన్ చేపట్టడం ఇది మూడోసారి. గతంలో 2005లో తొమ్మిది రోజుల పాటు, 2008 ఆగస్టు నుంచి 2009 జనవరి వరకు నాలుగు నెలలపాటు రెండు సార్లు ముఖ్యమంత్రిగా సొరేన్ పనిచేశారు. సొరేన్ ను గురూజీ అని పిలుస్తారు. ఆయన 1944 జనవరి 11వ తేదీన హజారీబాగ్ జిల్లా నెమ్రా గ్రామంలో జన్మించారు. ఆయనపై ఆర్థిక లావాదేవీల ఆరోపణలు వచ్చాయి. అయినా ఆయన ప్రజాదరమ ఏ మాత్రం తగ్గలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+