విడుదలైన సూరికి ప్రైవేటు సైన్యం రక్షణ

జీవిత ఖైదీలను విడుదల చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీఓ ప్రకారం గత అక్టోబరు 2న గాంధీ జయంతి రోజునే, సూరికి కారు బాంబు కేసు నుండి విముక్తి లభించింది. అయితే, పరిటాల హత్య కేసులోనూ, బెంగుళూరుకు సంబంధించిన మరో కేసులోనూ ఆయనకు బెయిల్ రావడం లో జాప్యం జరిగి, విడుదల కాలేదు. ఈ రెండు కేసుల్లోనూ ఇటీవలే బెయిల్ మంజూరయింది. పరిటాల రవి హత్య కేసులో షరతులతో కూడిన బెయిలు వ చ్చింది.
ఆ షరతుల ప్రకారం సూరి, కేసు వాయిదా స మయంలో మినహా తక్కిన రోజుల్లో అనంతపురం జి ల్లాలో ఉండకూడదు. గురువారం, ఆదివారం హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో హాజరు కావాల్సి ఉంది. బెయిలు మంజూరయిన నేపథ్యంలో, కోర్టు ఆ దేశాల ప్రకారం జామీను తదితర ప్రక్రియలు పూర్తి అయిన తరువాత మంగళవారం జైలు అధికారులు విడుదల చేశారు.












Click it and Unblock the Notifications