వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ ను సైతాన్ అనలేదు: కాకా

By Pratap
|
Google Oneindia TeluguNews

G Venkataswamy
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని తాను సైతాన్ అనలేదని కాంగ్రెసు పార్లమెంట సభ్యుడు జి. వెంకటస్వామి (కాకా) స్పష్టం చేశారు. వైయస్ ను తాను సైతాన్ అన్నట్లు రుజువు చేస్తే రాజీనామా చేస్తానని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెలంగాణకు వైయస్ రాజశేఖర రెడ్డి అడ్డుపడుతున్నారని తాను నేరుగా విమర్శించిన మాట నిజమని ఆయన అన్నారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని అందరి కన్నా ముందు తానే అన్నట్లు ఆయన తెలిపారు. కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం తెలంగాణపై మరో సారి గురువారం ప్రకటన చేసిన తర్వాత ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణకు 53 ఏళ్ల దయ్యం వదిలిందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణపై కచ్చితమైన అభిప్రాయం చెప్పాలని రాష్ట్ర రాజకీయ పార్టీలను కేంద్ర హోం శాఖ అడుగుతుందని ఆయన చెప్పారు.

ముఖ్యమంత్రి కె. రోశయ్య వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. పరిశ్రమలు, సినీ రంగం తరలిపోతున్నాయని ముఖ్యమంత్రి అనడాన్ని ఆయన తప్పు పట్టారు. ఐటి, సినీ పరిశ్రమవారిని భయాందోళనలకు గురి చేసే వ్యాఖ్యలు ముఖ్యమంత్రి చేయడం సరి కాదని ఆయన అన్నారు. ఐటి, సినీ పరిశ్రమలు ఎక్కడికీ పోవని ఆయన అన్నారు. హైదరాబాద్ నుంచి పరిశ్రమలు కూడా తరలిపోవని ఆయన చెప్పారు. వందల ఏళ్లుగా హైదరాబాద్ కు వివిధ ప్రాంతాల పారిశ్రామికవేత్తలు తరలి వచ్చారని, వారు ఇక్కడ స్థిరపడి ఇక్కడి ప్రజలతో కలిసి పోయారని ఆయన అన్నారు. హైదరాబాద్ తెలంగాణ మధ్యలో ఉందని, హైదరాబాద్ పారిశ్రామికవేత్తలకు అనువైన ప్రదేశమని ఆయన అన్నారు. పారిశ్రామికవేత్తలు హైదరాబాద్ నుంచి ఎక్కడికీ పోరని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X