రాజీనామాల ఆమోదానికే ఒత్తిడి: నాగం జనార్దన్ రెడ్డి

కేంద్ర ప్రభుత్వం జనవరి 5వ తేదీన తలపెట్టిన చర్చలపై పునరాలోచన చేయాలని ఆయన కోరారు. పార్టీ ప్రాంతాలవారీగా చీలిపోయినందున అన్ని పార్టీల్లో గందరగోళ పరిస్థితి నెలకొన్నదని, అందువల్ల చర్చల ప్రక్రియ సరైంది కాదని ఆయన అన్నారు. కమిటీ ఏర్పాటు పేరుతో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుపై కాలయాపన చేయాలని చూస్తోందని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ఎప్పుడు ప్రారంభిస్తారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్దిష్టమైన గడువు చెప్పాలని, పార్లమెంటులో బిల్లు ప్రతిపాదించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. పార్లమెంటులో బిల్లు ఎప్పుడు ప్రతిపాదిస్తారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications