వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఉత్తరాది రవాణాకు పొగమంచు దెబ్బ

తొమ్మిది అంతర్జాతీయ విమానాలను ముంబై, అహ్మదాబాద్, జైపూర్ లకు తరలించారు. ఉదయం పూట విమానాలన్నీ రెండు, మూడు గంటల పాటు ఆలస్యంగా బయలుదేరాయి. ఉత్తర రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. ఇతర రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ , జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. పంజాబ్, హర్యానాల్లో రెండు డజన్ల రైళ్లపై దాని ప్రభావం పడింది. డీజిల్ ఇంజిన్లతో వాటిని నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఉత్తరాది గ్రిడ్ ట్రిప్పింగ్ తెల్లవారు జామున మూడు గంటల ప్రాంతంలో జరిగింది.
పంజాప్, హర్యానా జాతీయ రహదారులపై వాహనాలు సరిగా నడవడం లేదు. అమృతసర్ లో చలిగాలులు వీస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో జీరో డిగ్రీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వచ్చే వారం వరకు డ్రై, కోల్డ్ స్పెల్ కొనసాగవచ్చునని భావిస్తున్నారు.