వ్యతిరేకమైతే అక్కడికక్కడే రాజీనామా: జూపల్లి కృష్ణారావు

సమైక్యవాదులు ప్రజలను రెచ్చగొట్టవద్దని ఐటి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు. ఐదో తేదీ సమావేశం తర్వాతనే తాను రాజీనామాను ఉపసంహరించుకునే విషయాన్ని ఆలోచిస్తానని ఆయన చెప్పారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రకటించిన తర్వాత దాన్ని వ్యతిరేకించడం సరైంది కాదని ఆయన అన్నారు. తెలంగాణలోని కోస్తాంధ్రవారికి అభద్రతా భావం అవసరం లేదని ఆయన అన్నారు. అన్నదమ్ముల్లా విడిపోయి, అన్నదమ్ముల్లా కలిసుందామని ఆయన సమైక్యావాదులను కోరారు.












Click it and Unblock the Notifications