వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆస్ట్రేలియాలో మరో భారతీయుడి మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Nitin Garg
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలో మరో భారతీయుడు మరణించాడు. దక్షిణ ఆస్ట్రేలియాలో ఓ శవం బయటపడింది. అది భారతీయుడి శవమని భావిస్తున్నారు. వారం రోజుల క్రితం న్యూ సౌత్ వేల్స్ లో కాలిన భారతీయుడి మృతదేహం బయటపడినట్లు పోలీసులు మంగళవారం చెప్పారు. 25 ఏళ్ల వయస్సు గల భారతీయుడి శవం డిసెంబర్ 29వ తేదీన గ్రీఫిత్ సమీపంలో రోడ్డు పక్కన పడి ఉంది.

ఆ వ్యక్తిని గుర్తించడానికి ఆస్ట్రేలియా అధికారుల భారత దేశంలోని ఆ వ్యక్తి కుటుంబ సభ్యులను, ఇండియన్ కాన్సులేట్ ను సంప్రదిస్తున్నారు. ఇటీవలే నితిన్ గార్గ్ అనే 21 ఏళ్ల యువకుడు ఆదివారం హత్యకు గురైన విషయం తెలిసిందే. గార్గ్ హత్యపై భారతదేశం తీవ్రంగా ప్రతిస్పందించింది. ఆ సంఘటనపై ఆస్ట్రేలియా విచారణకు కూడా ఆదేశించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X