న్యూఢిల్లీ: శుకుని మామ, తుపాకి రాముడు తెలంగాణకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారని తెలంగాణకు చెందిన కాంగ్రెసు శాసనసభ్యుడు ఆర్. దామోదర్ రెడ్డి వ్యాఖ్యానించారు. సీమాంధ్ర నాయకులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికి కుట్రలు చేస్తున్నారని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. మావోయిస్టులు తెలంగాణ ఉద్యమం చేస్తున్నారని కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అనడాన్ని ఆయన ఖండించారు. తెలంగాణలోని నాలుగు కోట్ల ప్రజలను మావోయిస్టులుగా చిత్రీకరించడాన్ని ఆయన వ్యతిరేకించారు.
ఢిల్లీలో పరిస్థితి మారిపోయినట్లు కనిపిస్తోందని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుందనే ఆశలు సన్నగిల్లుతున్నాయని ఆయన అన్నారు. ప్రత్యేక తెలంగాణ దిశగా కంటితుడుపు ప్రకటన మాత్రమే కేంద్రం నుంచి అవకాశాలున్నాయని ఆయన అన్నారు. తెలంగాణ ఇస్తే నక్సలైటు రాజ్యం వస్తుందని కేంద్రానికి, కాంగ్రెసు అధిష్టానానికి నివేదిక ఇచ్చారని, ఇది సరైంది కాదని, తెలంగాణలోని నాలుగు కోట్ల ప్రజలను మావోయిస్టులుగా జత కట్టడం అన్యాయమని ఆయన అన్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి