న్యూఢిల్లీ: ఆత్మద్రోహం చేసుకోవద్దని, రాజకీయ నాయకులు స్వేచ్చగా తమ భావాలను వెల్లడించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎన్. రఘువీరా రెడ్డి రాజకీయ నాయకులకు సూచించారు. రాష్ట్ర విభజన అంశం చర్చకు వచ్చిన నేపథ్యంలో ఆయన ఈ సూచన చేశారు. నిరుడు డిసెంబర్ 7వ తేదీన అన్ని రాజకీయ పార్టీలు తప్పు చేశాయని ఆయన అభిప్రాయపడ్డారు.
సీమాంధ్ర ప్రజల గురించి తెలంగాణవారు హీనంగా మాట్లాడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని ప్రాంతాలకూ న్యాయం జరగాలని, దీని గురించే చర్చ జరగాల్సి ఉందని ఆయన అన్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి