అన్ని పదవులకు ఎస్పీ నేత అమర్ సింగ్ రాజీనామా

Amar Singh
న్యూఢిల్లీ: పార్టీ ప్రధాన కార్యదర్శి పదవితో పాటు ఇతర పదవులన్నింటికీ సమాజ్ వాదీ పార్టీ నేత అమర్ సింగ్ రాజీనామా చేశారు. ఆరోగ్య కారణాలు చెప్పి ఆయన సమాజ్ వాదీ ప్రధాన కార్యదర్శి పదవికి, పార్లమెంటు సభ్యత్వానికి, పార్లమెంటరీ బోర్డు సభ్యత్వానికి బుధవారం రాజీనామా చేశారు. పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ తో విభేదాల కారణంగానే ఆయన ఆరోగ్య కారణాలు చెప్పి ఆయన రాజీనామాలు చేసినట్లు సమాచారం.

దుబాయ్ లో ఉన్న అమర్ సింగ్ తన రాజీనామా లేఖను ములాయం సింగ్ కు ఫ్యాక్స్ ద్వారా పంపించారు. తక్షణమే తాను మూడు పదవుల నుంచి కూడా తప్పుకుంటున్నట్లు అమర్ సింగ్ తెలిపారు. పార్టీ అధికార ప్రతినిధి పదవి నుంచి కూడా ఆయన తప్పుకున్నారు. తన రాజీనామా వెనక ఏ విధమైన రాజకీయ ఉద్దేశాలు లేవని ఆయన చెప్పారు. విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సలహా ఇచ్చారని, అందువల్లనే తాను పదవుల నుంచి తప్పుకుంటున్నానని ఆయన అన్నారు.

మూడు నెలల క్రితం సింగపూర్ లో కిడ్నీ ఆపరేషన్ చేయించుకున్నప్పుడే వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారని, అయితే ములాయం సింగ్ కోసం తాను రాజకీయాల్లోంచి తప్పుకోలేకపోయానని, ఇరవై ఏళ్ల తరవాత తాను తన పిల్లను, తన భార్యను చూసుకోవాల్సిన అవసరం గుర్తించానని ఆయన అన్నారు. ములాయంతో తనకు ఏ విధమైన విభేదాలు లేవని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+