రాష్ట్రం విడిపోదనే నమ్మకం ఉంది: గాదె వెంకటరెడ్డి

రెండో ఎస్సార్సీ ద్వారానే తెలంగాణ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆయన అన్నారు. మొదటి ఎస్సార్సీలోని విషయాలను తాము పరిగణనలోకి తీసుకుంటామని మాత్రమే కాంగ్రెసు చెప్పిందని ఆయన అన్నారు. దేశంలో అన్నిప్రాంతాల్లో రాష్ట్ర విభజన సమస్య ఉందని, ఆ సమస్యకు పరిష్కారం లభించాలంటే రెండో ఎస్సార్సీ వేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు. రాష్ట్రాల విభజనపై జాతీయ విధానం ఉండాలనే తెలుగుదేశం అభిప్రాయంతో తాము ఏకీభవిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఉద్యమాల వల్ల ఆస్తి నష్టాలు జరుగుతున్నాయని, ఆర్థికంగా రాష్టానికి నష్టం జరుగుతోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications