విశాఖపట్నం: విశాఖపట్నంలో ఓ ఆస్ట్రేలియన్ వీరంగం సృష్టించాడు. మద్యం సేవించి విచ్చలవిడిగా వ్యవహరించాడు. విశాఖపట్నంలోని బీచ్ రోడ్డులో గల ప్రగతి అపార్టుమెంటులో లూయిస్ అనే ఆస్ట్రేలియన్ మద్య సేవించి ఎయిర్ గన్ తో రోడ్డుపై వెళ్తున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఓ వ్యక్తి గాయపడ్డాడు.
గాయపడిన వ్యక్తిని సంతోష్ గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని లూయిస్ ను అరెస్టు చేశారు. అతనిపై కేసు నమోదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.