కాంగ్రెసు తెలంగాణ వైఖరి చెప్పాలి: నాగం జనార్దన్ రెడ్డి

శాంతియుతంగా ఆందోళనలు చేయాలని, ప్రాణ త్యాగాలు చేసుకోవద్దని నాగం విద్యార్థులను కోరారు. అందరం కలిసి పోరాడి తెలంగాణ సాధించుకుందామని ఆయన అన్నారు. తెలంగాణపై నిర్దిష్ట కాలపరిమితి పెట్టి ప్రకటన చేయాలని తాము కేంద్ర హోం మంత్రి చిదంబరాన్ని డిమాండ్ చేసినట్లు తెలుగుదేశం మరో తెలంగాణ నాయకుడు రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. తమను ఢిల్లీ అఖిల పక్ష సమావేశానికి ఎందుకు పిలిపించారో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. శాంతికి పిలుపునిస్తూ అఖిల పక్ష ప్రకటనపై సంతకం చేయడానికి తాను తొలుత నిరాకరించినట్లు ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 9వ తేదీన చిదంబరం చేసిన ప్రకటనకు కట్టుబడి ఉందో లేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ ప్రకటనకు కేంద్రం కట్టుబడి ఉండాలని ఆయన అన్నారు. ఆ ప్రకటనకు తెలంగాణ ప్రజలు ఎంతో సంతోషించారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications