తెలంగాణపై రాజకీయేతర నిపుణల కమిటీ?

రాష్ట్ర ఏర్పాటుకు కచ్చితంగా స్పష్టమైన విధివిధానాలతో కాలపరిమితి విధిస్తూ ప్రకటన చేసే వరకు తెలంగాణలో ఆందోళన సాగిస్తామని తెలంగాణ జెఎసి స్పష్టం చేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వం పునరాలోచనలో పడింది. కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం బుధవారం తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుతో, కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివ రావుతో చర్చలు జరిపారు. వారితో చర్చల అనంతరం రాజకీయ నాయకులతో సంబంధం లేని కమిటీని వేయాలని, ఈ కమిటీలో వివిధ వర్గాలకు చెందిన నిపుణులను సభ్యులుగా వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. తొలుత సుప్రీంకోర్టు న్యాయమూర్తితో కమిటీ వేయాలని అనుకుంది. అయితే అందుకు కెసిఆర్ అంగీరించలేదు. కాలయాపన చేసే ఎటువంటి కమిటీలకు కూడా తాము ఆంగీకరించబోమని కెసిఆర్ చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు రోడ్ మ్యాప్ వేయడానికి రాజకీయేతర నిపుణుల కమిటీని ప్రకటించడం మంచిదనే అభిప్రాయానికి కేంద్రం వచ్చినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications