వివాదాల పుట్ట ఎస్ఎస్పీ యాదవ్

గతంలో కూడా యాదవ్ ఎవరికీ సమాచారం ఇవ్వకుండా వెళ్లిపోయారు. డిజిపిగా ఉన్నప్పుడే ఆయన ఆ విధంగా వ్యవహరించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి ఆయన అత్యంత సన్నిహితుడిగా వ్యవహరించారు. ఎన్నికల సమయంలో డిజిపిగా ఉన్న యాదవ్ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వానికి బహిరంగంగా వత్తాసు పలికారు. దీంతో ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవడంతో ఆ పదవికి దూరంగా ఉన్నారు. ఎన్నికల్లో గెలిచి వైయస్ తిరిగి అధికార పగ్గాలు చేపట్టిన మరు క్షణమే యాదవ్ ను తిరిగి డిజిపిగా నియమించారు. వైయస్ మృతి సమయంలో కూడా యాదవ్ వ్యవహారశైలిపై వివాదం చెలరేగింది. దీంతో ముఖ్యమంత్రి రోశయ్య యాదవ్ ను డిజిపి పదవి నుంచి తొలగించి ఆర్టీసి ఎండిగా వేశారు. దీంతో యావద్ రోశయ్యపై మండిపడుతున్నారు. నిజానికి వైయస్ తప్ప మరొకరి మాట వినాల్సిన అవసరం లేదనే పద్ధతిలో ఆయన వ్యవహరిస్తూ వస్తున్నారు.












Click it and Unblock the Notifications