ఆర్టీసి చార్జీల వడ్డన: తీవ్ర నిరసనలు

కిలోమీటరకు వోల్వో బస్సుకు 25 పైసలు, మేఘదూత్ ఎసికి 15 పైసలు, మేఘదూత్ నాన్ ఎసికి 13 పైసలు, సూపర్ లగ్జరీ బస్సుకు 13 పైసలు, డీలక్స్ బస్సుకు 11 పైసలు, ఎక్స్ ప్రెస్ చార్జీని 10 పైసలు, ఆర్డినరీ బస్సుకు 8 పైసలు పెంచింది. విద్యార్థి బస్సు చార్జీలు, రూట్ పాసుల చార్జీలు కూడా పెరిగాయి. ఒక్క హైదరాబాదులోనే బస్సు చార్జీల పెంపు ద్వారా ఏడాదికి 180 కోట్ల రూపాయలు అర్జినుంది. ఆర్టీసి చార్జీల పెంపుపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. సామాన్యుడి నడ్డి విరిచేందుకు ప్రభుత్వం సిద్ధపడిందని విమర్శించాయి. ఆర్టీసి బస్సు డిపోల ముందు ధర్నాకు తెలుగుదేశం నాయకులు సిద్ధపడ్డారు.












Click it and Unblock the Notifications