ఉహాజనిత కథనాలు సరి కాదు: చిరంజీవి

ఆర్టీసి బస్సు చార్జీలను మరింత తగ్గించే విషయంపై ఆలోచన చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. పెంచిన ఆర్టీసి చార్జీలను కాస్తా తగ్గించినప్పటికీ ఇంకా తగ్గించాలని కోరామని ఆయన చెప్పారు. ఆర్టీసిలో గత కొన్నేళ్లుగా నష్టాలు పేరుకు పోతున్నాయని, వాటి నుంచి బయటపడడానికి ఆర్టీసి చార్జీలు పెంచకతప్పదని ముఖ్యమంత్రి వివరించినట్లు ఆయన తెలిపారు. అయితే ఒకేసారి అంత పెద్ద మొత్తం చార్జీలు పెంచడం తగదని తాము చెప్పినట్లు ఆయన చెప్పారు. విద్యార్థులపై భారం తగ్గిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications