వైఎస్ బతికి, ఎప్పుడైనా తిరిగిరావచ్చు: ఉండవల్లి

Undavalli Arun Kumar
హైదరాబాద్ : తాత్కాలిక ఆవేశాలకు పోయి యువత తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని రాజమండ్రి ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ హితవు పలికారు. అనాలోచితంగా ఆవేశాలకు గురై ఉద్రేకంతో విధ్వంసాలు చేస్తే కోర్టుల చుట్టూ తరగాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. దాడులు, అల్లర్లు, విధ్వంసాలకు పాల్పడి భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దని ఆయన యువతకు సూచించారు. రాష్ట్ర సచివాలయం వద్దు శుక్రవారంనాడు ఉండవల్లి మీడియాతో మాట్లాడారు. వైఎస్ మృతి ప్రమాదం కాదని, కుట్ర ఏదో దాగి ఉందని బ్లాగ్ లో ఉన్నట్లు చానళ్ళు ప్రసారం చేశాయన్నారు.

రాష్ట్ర ప్రజల్లో కొంత మంది గుండెల్లో దివంగత రాజశేఖరరెడ్డి ఇప్పటికీ హీరోగానే నిలిచి ఉన్నారన్నారు. అసలు ఆయన మరణించనే లేదని, సినిమాల్లో చూపించే విథంగా ఆయన ఏదో ఒక రోజు మన మధ్యకు వచ్చేస్తారన్న అభిప్రాయంలో కూడా కొందరు ఉన్నారన్నారు. అలాంటి వారి చెవికి 'వైఎస్ మరణం వెనుక కుట్ర' లాంటి వార్త వినపడితే వెంటనే తీవ్రంగా స్పందిస్తారన్నారు. అయితే, ఇలాంటి ఆవేశాలకు యువత లోను కావద్దని ఆయన కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+