హైదరాబాద్: తన తండ్రి మరణం వెనక కుట్ర ఉందన్న కథనం చూసి తాను కూడా షాక్ కు గురయ్యానని వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడు, కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ అన్నారు. ఈ కోణంలో దర్యాప్తు జరపడానికి కేంద్రంపై ఒత్తిడి తెస్తామని, అందుకు దాడులు పరిష్కారం కాదని ఆయన గురువారం చెప్పారు. అభిమానులు సంయమనం పాటించాలని ఆయన కోరారు. విధ్వంసం, బంద్ లు ఆపాలని, చేతులు జోడించి వేడుకుంటున్నానని ఆయన అన్నారు.
భావోద్వేగాలకు గురి కావద్దని, సంయమనం పాటించాలని ఆయన వైయస్ అభిమానులను, ఆందోళనకారులను ఆయన కోరారు. వైయస్ మృతికి కుట్ర జరిగిదంటూ టీవీ చానెళ్లలో వార్తాకథనం ప్రసారమైన వెంటనే ఎక్కడికక్కడ విధ్వంసాలు చెలరేగాయి. కొద్ది సేపట్లోనే బంద్ లకు పిలుపునిచ్చారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి