వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీడియాపై సిపిఐ నారాయణ చిందులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Narayana
అనంతపురం: సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ శనివారం మీడియా ప్రతినిధులపై అనంతపురంలో చిందులేశారు. మీడియా ప్రతినిధులపై ఆయన విసుక్కున్నారు. దీనికి నిరసనగా మీడియా ప్రతినిధులు నారాయణ మీడియా ప్రతినిధుల సమావేశాన్ని బహిష్కరించారు. మీడియా ప్రతినిధులు ప్రశ్నలు వేయడానికి సిద్ధపడడంతో నారాయణ విరుచుకుపడ్డారు. తాను చెప్పేది వినాలని ఆదేశించే ప్రయత్నం చేశారు.తాను చెప్పేది వినకపోతే వెళ్లిపోవాలని అన్నారు.

ఇది తాము పెట్టిన ప్రెస్ మీట్ అని, తాము చెప్పేది వినాలని ఆయన అన్నారు. మీరు అడిగేదేమిటని ఎదురు ప్రశ్న వేశారు. తానేమీ పారిపోవడం లేదని అన్నారు. అంతా మీ ఇష్టమేనా అని ఆయన మీడియా ప్రతినిధులను గద్దించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X