దేవెగౌడ బూతు తిట్లు: యెడ్యూరప్ప గరం

యెడ్యూరప్ప తన అనుచరులతో ఆ విషయంపై చర్చించారు. దేవెగౌడపై ఏ విధమైన చర్యలు తీసుకోవాలనేది రాష్ట్ర ప్రజలకు వదిలేద్దామని యెడ్యూరప్ప తన అనుచరులతో అన్నట్లు సమాచారం. దేవెగౌడ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, లేదంటే కోర్టుకెక్తుతామని బిజెపి రాష్ట్ర శాఖ సోమవారం హెచ్చరించింది. తాము దేవెగౌడపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బిజెపి నాయకుడు ధనంజయ్ కుమార్ చెప్పారు. యెడ్యూరప్పపై చేసిన వ్యాఖ్యలు దేవెగౌడ నిస్ప్పహకు అద్దం పడుతున్నాయని బిజెపి కేంద్ర నాయకుడు ప్రకాష్ జవేదకర్ అన్నారు. దేవెగౌడ ఆరోగ్యం బాగుపడాలని తాను సందేశం పంపుతానని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications