కర్నూలు: కర్నూలు జిల్లా కృష్ణగిరి సింగిల్ విండో ఉప ఎన్నికల్లో దౌర్జన్యం కేసులో అరెస్టయిన తెలుగుదేశం శాసనసభ్యుడు కెఇ ప్రభాకర్ బెయిల్ పై విడుదలయ్యారు. ఆయనకు కర్నూలు జిల్లా డోన్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. సోమవారం ఉదయం పత్తికొండ శాసనసభ్యుడు కెఇ ప్రభాకర్ ను పోలీసులు అరెస్టు చేసి డోన్ కోర్టులో ప్రవేశపెట్టారు. ఆయనకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
తనను కావాలనే ప్రభుత్వం ఈ కేసులో ఇరికించిందని కెఇ ప్రభాకర్ విమర్శించారు. ఎప్పుడో ఎస్సైపై ఉద్రేకంతో జరిగిన తగాదాను ఆసరాగా తీసుకుని ప్రభుత్వం తనను కేసులో ఇరికించిందని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. తన సామాజిక వర్గాన్ని బలహీనపరిచేందుకు ప్రభుత్వం కుట్ర చేసిందని ఆయన అన్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి