మేం ఎవరికీ వ్యతిరేకం కాదు: నిర్మాతలు

Murali Mohan
హైదరాబాద్: తెలుగు సినీ కళాకారులు ఉద్యమాలకు వ్యతిరేకం కాదని తెలుగు చలన చిత్ర నిర్మాత మండలికి చెందిన శ్యాంప్రసాద్ రెడ్డి, మురళీ మోహన్, తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. సంక్రాంతికి విడుదలయ్యే సినిమాల ప్రదర్శనను అడ్డుకోవద్దని వారు తెలంగాణ ఆందోళనకారులకు మంగళవారం విజ్ఞప్తి చేశారు. సినిమాలు ఉద్యమాలకు వ్యతిరేకం కాదని వారన్నారు. వినోదం పంచడం మాత్రమే తమ లక్ష్యమని, తెలుగు సినీ పరిశ్రమలో ప్రాంతీయ విభేదాలు లేవని వారన్నారు. తెలుగు సినీ పరిశ్రమ యంత్రాల మీద ఆధారపడింది కాదని, ఇది సృజనాత్మక పరిశ్రమ అని, మనుషుల మీద ఆధారపడి ఉందని వారు వివరించారు. ప్రస్తుత స్థితిలో షూటింగులు జరుపుకోవడానికి కూడా భయపడుతున్నారని, దీంతో షూటింగులు తగ్గాయని వారన్నారు.

ఎవరైనా తమ పరిశ్రమకు చెందినవారు భావప్రకటనా స్వేచ్ఛ పేరుతో మాట్లాడినా అది వారి వ్యక్తిగత అభిప్రాయమే తప్ప పరిశ్రమకు సంబంధం లేదని వారన్నారు. తమ సినిమాలను అందరూ చూడాలని, తమ సినిమాలు అన్ని ప్రాంతాల్లో ఆడాలని కోరుకుంటున్నామని వారు చెప్పారు. అదుర్స్ సినిమాను అడ్డుకుంటామని తెలంగాణ ఆందోళనకారులు హెచ్చరించిన నేపథ్యంలో వారు సినిమాలను అడ్డుకోవద్దని మంగళవారం విజ్ఞప్తి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+