వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అదుర్స్ ను ఎట్టి స్థితిలో ఆడనివ్వం: కవిత

సినిమాను ప్రదర్శించకపోవడం వల్ల థియేటర్ యజమానులకు, డిస్టిబ్యూటర్లకు ఏ విధమైన నష్టం లేదని ఆమె అన్నారు. బయ్యర్లు సినిమా కొని నష్టపోవద్దని ఆమె సూచించారు. తాను తెలంగాణ బిడ్డనని, ఆంధ్రవాళ్లు కూడా తన సినిమాను ఆదరించాలని కోరితే భావసారూప్యత ఉండేదని ఆమె అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ అందరివాడినని అంటున్నారని, ఇది వరకు తాను అందరివాడినని చెప్పిన హీరో తెలంగాణవారిని మోసం చేశాడని ఆమె చిరంజీవిని ఉద్దేశించి అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రకటనలో తెలంగాణ పదం లేదని, హైదరాబాద్ అని మాత్రమే ఉందని, ఇందుకు తాము బాధపడుతున్నామని ఆమె చెప్పారు.