రాజీనామాలపై తెలంగాణ కాంగ్రెసులో విభజన

రాజీనామాల ఆమోదంపై వెనక్కి తగ్గుతున్నవారి వాదనతో పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ వంటి కాంగ్రెసులోని కొంత మంది తెలంగాణ అతివాద నాయకులు విభేదిస్తున్నారు. ఒక్కసారి రాజీనామాలు చేసిన తర్వాత వెనక్కి తగ్గితే ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి ఉంటుందని, ప్రజలు రాజీనామాలను కోరుకుంటున్నారని మధు యాష్టీ వంటి నేతలు అభిప్రాయపడుతున్నారు. రాజీనామాలపై వెనక్కి తగ్గాలనే వాదనను తెలంగాణ వ్యతిరేక కుట్రగా కూడా వారు భావిస్తున్నారు. జెఎసిలో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత వెనక్కి తగ్గడం వల్ల పరువు పోతుందని కూడా వారంటున్నారు. కాగా, రాజీనామాలను ఆమోదింపజేసుకునే విషయంలో తాము తీసుకున్న నిర్ణయం నుంచి వెనక్కి తగ్గేది లేదని జెఎసి కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ అంటున్నారు.












Click it and Unblock the Notifications