రాష్ట్రానికి చెందిన అయ్యప్ప స్వాముల దుర్మరణం

నందిగామ సమీపంలోని అనాసాగరానికి చెందిన 11 మంది అయ్యప్ప భక్తులు కేరళ సమీపంలో ఇటీవల లారీ ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. కేరళ రాష్ట్రంలో ఎరిమెలి వద్ద మృతిచెందిన అయ్యప్పస్వాముల భౌతికకాయాలు ఎట్టకేలకు గురువారం అర్ధరాత్రికి అనాసాగరం గ్రామానికి చేరుకున్నాయి. మృతదేహాలను రోడ్డు మార్గం ద్వారా తరలిస్తున్నందున ఎక్కువ సమయం పట్ట్టింది. ప్రభుత్వం సరిగా స్పందించలేదంటూ బాధితులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. మృతిచెందిన 11 మందికి బుధవారం కొట్టాయం ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. కొట్టాయం డిప్యూటీ తహసీల్దార్ రమేష్‌కుమార్ ఆధ్వర్యంలో 11 మృతదేహాలను ఆరు అంబులెన్సులలో అనాసాగరం తీసుకువచ్చారు. బుధవారం సాయంత్రం 3.30 గంటల సమయంలో అక్కడ బయలు దేరారు.












Click it and Unblock the Notifications