హైదరాబాదు: జ్యోతిబసు మరణం కమ్యూనిస్టు పార్టీలకు తీరని లోటని సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు నారాయణ, రాఘవులు అభిప్రాయపడ్డారు. మార్క్సిజాన్ని జ్యోతిబసులా అధ్యయనం చేసిన వ్యక్తి భారతదేశంలో మరొకరు లేరని సీపీఎం నేత రాఘవులు అన్నారు. ఆయనతో కలిసి పొలిట్‌బ్యూరోలో పనిచేయడం మంచి అనుభవమని పేర్కొన్నారు. దివిసీమ ఉప్పెన సమయంలో మన రాష్ట్రంలో జ్యోతిబసు పర్యటించడాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు.
లెఫ్ట్ పార్టీల చీలికను వ్యతిరేకించి, వారి ఐక్యత కోసం ప్రయత్నించారనిసీపీఐ నేత నారాయణ గుర్తుచేసుకున్నారు. ఇప్పుడున్న నేతలెవరూ జ్యోతిబసు స్థాయిని అందుకోవడం సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.