గ్రేటర్ ఫ్లోర్ లీడర్ ఎంపిక బాధ్యత డి. శ్రీనివాస్ కే
State
oi-Santaram
By Santaram
హైదరాబాదు: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో రేపు జరిగే మైనార్టీ కో ఆప్షన్ సభ్యుల ఎంపికతో పాటు, ఫ్లోర్ లీడర్ ఎంపికను పీసీసీ అధ్యక్షుడు డి శ్రీనివాస్‌కు అప్పగిస్తూ గ్రేటర్ కాంగ్రెస్ నేతలు తీర్మానం చేశారు. కో ఆప్షన్ సభ్యుల ఎంపిక, గ్రేటర్‌లో పార్టీ సభ్యత్వ తీరును సమీక్షించేందుకు పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ గ్రేటర్ పరిధిలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లతో సమావేశమయ్యారు.
ఇద్దరు మైనార్టీ కో ఆప్షన్ సభ్యులుగా ఎవరిని ఎంపిక చేయాలన్న దానితో పాటు ఫ్లోర్‌లీడర్ల ఎంపికనూ డీఎస్‌కు అప్పగించారు. ఈ వ్యవహారంపై పీసీసీ చీఫ్ డీఎస్ ఈ సాయంత్రం ఎంఐఎంతో చర్చలు జరిపి ప్రకటిస్తారు.