మహానేత జ్యోతిబసు మృతిపై సంతాపాల వెల్లువ

కమ్యునిస్టు యోధుడు జ్యోతిబసు మృతిపట్ల రాష్ట్రానికి చెందిన పలువురు నేతలు సంతాపం తెలిపారు. జ్యోతి బసు మృతి భారత రాజకీయాలకు తీరనిలోటని పలువురు నేతలు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కె.రోశయ్య, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్, ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తదితరులు బసుమృతికి సంతాపం తెలిపినవారిలో ఉన్నారు. జ్యోతిబసు అంత్యక్రియలు మంగళవారం జరుగుతాయి.












Click it and Unblock the Notifications