కమ్యూనిస్టు నేత జ్యోతిబసు అవయవాలు పరిశోధనకు

హైదరాబాద్: భూసంస్కరణలు ప్రవేశపెట్టిన గొప్ప పాలనాదక్షకుడు సీపీఎం నేత జ్యోతిబసు అని ఎమ్మెల్సీ నాగేశ్వర్ హైదరాబాద్ లో పేర్కొన్నారు. ఆధునిక భారత రాజకీయాల్లో జ్యోతిబసు అధ్యాయం చిరస్మరణీయమని వ్యాఖ్యానించారు. జ్యోతిబసు మృతి వామపక్ష ఉద్యమానికి తీరని లోటన్నారు. తొలిసారిగా స్థానిక సంస్థలకు నిధులు కేటాయించి, ఎన్నికలు నిర్వహించి పంచాయతీరాజ్ వ్యవస్థకు జీవం పోశారన్నారు. రైతుకూలీలు, కార్మికుల సంక్షేమం కోసం జ్యోతిబసు చేసిన కృషి ఆదర్శనీయమని కొనియాడారు.












Click it and Unblock the Notifications