ఎన్టీఆర్ వ్యక్తి కాదు వ్యవస్థ: బాబు

Chandrbabu Naidu
హైదరాబాద్: ఎన్టీఆర్ వ్యక్తి కాదు వ్యవస్థ అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. హైదరాబాదులోని రసూల్ పురాలో సోమవారం ఎన్టీఆర్ అమరజ్యోతి యాత్రను ఆయన ప్రారంభించారు. ఆ తర్వాత ఎన్టీఆర్ ఘాటు వద్ద ఆయన నివాళులు అర్పించారు. ఆయన వెంట సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, పార్టీ నాయకులు టి. దేవేందర్ గౌడ్ తదితరులు ఉన్నారు. ఎన్టీఆర్ సినిమాల్లోనూ రాజకీయాల్లోనూ తన ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకున్నారని చంద్రబాబు అన్నారు. పౌరాణిక పాత్ర పోషణలో ఎన్టీఆర్ ను అధిగమించేవారు లేరని ఆయన అన్నారు. రాజకీయాల్లో కూడా ఎన్టీఆర్ తనదైన ముద్రను వేశారని ఆయన అన్నారు.

ఎన్టీఆర్ పేదల కోసం, బడుగుల కోసం నిరంతరం కృషి చేశారని ఆయన అన్నారు. రాజకీయాల్లో సామాజిక న్యాయం కోసం ఎన్టీఆర్ పాదులు వేశారని, ఎన్టీఆర్ బడుగులకు, బీసీలకు రాజకీయాల్లో స్థానం కల్పించారని ఆయన అన్నారు. సంక్షేమానికి ఎన్టీఆర్ నిర్వచనం చెప్పారని ఆయన అన్నారు. జాతీయ స్థాయి రాజకీయాల్లో కూడా ఎన్టీఆర్ కృషి ఎనలేదని, ఎన్టీఆర్ చొరవతోనే జాతీయ స్థాయిలో నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ ఏర్పడ్డాయని ఆయన అన్నారు. తెలుగుప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఎన్టీఆర్ నిలిచారని, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఎన్టీఆర్ నిలబెట్టారని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+