బాబు లాంటి మోసగాడు లేడు: పార్వతి

తెలుగుదేశం పార్టీకి ఇలాంటి దుస్థితి దాపురిస్తుందని తాను అనుకోలేదని ఎన్టీఆర్ కు నివాళులు అర్పించిన అనంతరం ఆమె మీడియా ప్రతినిధులతో అన్నారు. చంద్రబాబు నాయుడే పార్టీకి ఈ దుస్థితి కల్పించారని ఆమె విమర్శించారు. ఎన్టీఆర్ చావుకు కారణమైనవారిని తాను వదిలిపెట్టనని ఆమె అన్నారు. ఎన్టీఆర్ కోరిక మేరకే తాను ఆయనను పెళ్లాడినట్లు ఆమె తెలిపారు. పెరాలెసిస్ తో బాధపడుతున్న సమయంలో తనను పెళ్లి చేసుకుంటావా అని ఎన్టీఆర్ అడిగితే తాను అంగీకరించానని, పదేళ్లుగా తనను చూశారు కాబట్టి తనను ఆ విధంగా అడిగారని ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications