ఆస్ట్రేలియాలో మరో భారతీయ ట్యాక్సీ డ్రైవర్ పై దాడి

రిజర్వాయర్ ప్రాంతంలో సోమర్‌హిల్ హోటల్ వద్ద కారు ఆపిన ఐదుగురిని ఎక్కించుకునేందుకు 25 ఏళ్ల భారతీయ డ్రైవర్ నిరాకరించాడు. తన కారులో ఐదుగురు ప్రయాణించేందుకు నిబంధనలు ఒప్పుకోవని చెప్పి, ఇద్దరిని మాత్రమే వాహనంలో ఎక్కించుకున్నాడు. ప్లెంటీ రోడ్డులో కారు ఆపి వీరిద్దరు డ్రైవర్‌పై దాడిచేసి, అక్కడి నుంచి పారిపోయారని పోలీసులు పేర్కొన్నారు. తమ స్నేహితులను కారులో ఎక్కించుకోలేదన్న కోపంతో వారీ ఘాతుకానికి పాల్పడ్డారని తెలిపారు.
ముఖానికి గాయాలయిన బాధితుడు అంబులెన్స్‌కు ఫోన్‌చేసి ఆస్పత్రిలో చేరినట్టు తమతో చెప్పాడని పోలీసులు పేర్కొన్నారు. దాడితో సంబంధమున్న నిందితుల ఫోటోలను విడుదల చేశారు. జాత్యహంకారంతో దాడి జరిగినట్టుగా ఎటువంటి ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications