మీ డాక్టర్ ఆన్ లైన్ లో...

1. పది సెకన్లలోపే ఆన్ లైన్ కన్సల్టేషన్ కోసం డాక్టరు అందుబాటులో ఉంటారు. లైవ్ చాట్ ద్వారా పగలు, రాత్రి 24/7
2. కార్డియాలజ్జిస్టులు, క్యాన్సర్ స్పెషలిస్టులు, గైనకాలజిస్టులను ఇ-మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు.
3. బరువు తగ్గడానికి, గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చే మహిళలకు వ్యక్తిగత ఆహార పట్టికలు ఇ-మెయిల్ ద్వారా అందుకోండి. వచ్చే కొద్ది వారాల్లో ఆరోగ్య సంరక్షణ కేలిక్యులేటర్లను, వ్యాధి సంబంధిత వ్యాసాలను, హెల్త్ ఫోరంను కూడా ప్రారంభిస్తాం.
ప్రపంచంలో మీరెక్కడున్నా మీ స్నేహితుడి వంటి డాక్టర్ దట్స్ తెలుగు డాట్ కామ్ ద్వారా ఇంటర్నెట్ లో అందుబాటులో ఉంటారు. మీ చాట్స్ కు ఎంబిబిఎస్ అంతకంటే ఎక్కువ అర్హత గల డాక్టర్లు జవాబిస్తారు.
మంచి ప్రారంభంలాగా అన్పిస్తోంది కదూ. దగ్గు, జలుబు, వైరల్ జ్వరాలకు కూడా హాఫ్ డే లీవ్ పెట్టి డాక్టర్ల వద్ద నిరీక్షించవలసిన అగత్యం ఉండదిక. ఇప్పుడు దట్స్ తెలుగు పాఠకులు డాక్టర్ సేవలను ఇంట్లో ఉండో, ఆఫీసులో పని చేసుకుంటూనో పొందవచ్చు. మెడికల్ ప్రొఫెషనల్స్ ప్రత్యేక సాఫ్ట్ వేర్ ను ఉపయోగించి సరైన వైద్య సేవలను, సరైన సమయంలో అందిస్తారు. ఇటువంటి సేవలతో వైద్య రంగం మరో అడుగు ముందుకు వేయబోతోంది.
"తన ఆరోగ్యం గురించి తెలుసుకునే, తన సమస్యలకు సమాధానాలు పొందే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది" అన్న మూల సూత్రం ఆధారంగా ఈ కార్యక్రమం రూపొందింది. "డాక్టర్ని సంప్రదించండి" అనే ఫీచర్ ను వన్ ఇండియా నేడు ప్రారంభించి, ఆన్ లైన్ కన్సల్టేషన్ కోరేవారికి సహాయకారిగా నిలుస్తోంది.
ఇది పెయిడ్ సర్వీసు. వన్ ఇండియా రిజిస్టర్డ్ యూజర్లకు అందుబాటులో ఉంటుంది. ఆర్టికల్ పేజీ తెరవగానే, మీకు కుడివైపున వున్న "ఆన్ లైన్ లో డాక్టర్" అనే ఐకాన్ ను క్లిక్ చేసి కొన్ని సెకెన్లలోనే నేరుగా డాక్టరుతో మాట్లాడవచ్చు. డాక్టరు గారు మీకు కొన్ని సెకన్ల దూరంలోనే ఉన్నారన్న వాస్తవాన్ని మరిచిపోకండి.












Click it and Unblock the Notifications