నలుగురితో నారాయణ: ట్విట్టర్ లోకి ఒబామా

అధ్యక్ష బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచీ విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్న ఒబామా ఆ రంగంలో చేపట్టదలచిన సంస్కరణలకు మరో 135 కోట్ల డాలర్లు కేటాయించాలని కాంగ్రెస్‌ను కోరనున్నారు. అధ్యక్షభవనం 'వైట్‌హౌస్' మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించింది. విద్యారంగానికి అమెరికా ప్రభుత్వం ఇప్పటికే 435 కోట్ల డాలర్లు కేటాయించింది. భారత్, చైనా విద్యార్థులకు ధీటుగా అమెరికా విద్యార్థులు గణితం, సైన్స్ రంగాల్లో ముందంజ వేయాలని ఒబామా తరచూ చెబుతుంటారు.
దేశ పరిస్థితులపై కాంగ్రెస్ ను ఉద్దేశించి అధ్యక్షుడు చేసే ఉపన్యాసం (స్టేట్ ఆఫ్ ది యూనియన్ అడ్రస్) ఈ నెల 27న ఉంటుందని వైట్‌హౌస్ తెలిపింది. ఒబామాకు ఇది తొలి ఉపన్యాసం. గత ఏడాది 20న అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన ఒబామా బుధవారంతో తొలి ఏడాది పూర్తి చేసుకుంటారు. ఆయన పనితీరుపై 45 నుంచి 57 శాతం మంది అమెరికన్లు సంతృప్తి వ్యక్తం చేశారని వివిధ సర్వేలు వెల్లడించాయి.












Click it and Unblock the Notifications