ఆందోళనలు చక్కదిద్దుతా: కొత్త కమిషనర్ ఖాన్

AK Khan
హైదరాబాద్‌: నగర పోలీస్‌ కమిషనర్‌ గా ఏకే ఖాన్‌ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ కమిషనర్‌ గా పనిచేసిన బి.ప్రసాదరావు ఆర్టీసీ ఎండీగా నియమితులవడంతో ఖాన్‌ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. గతంలో అదనపు కమిషనర్ గా నగరంలో పనిచేసిన అనుభవం ఉన్నందువల్ల అన్ని సమస్యలపై అవగాహన ఉందని, ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తానని ఆయన చెప్పారు. ఆందోళనలు జరుగుతున్న సమయంలో తాను కమిషనర్ గా వచ్చానని, పరిస్ధితులను చక్కదిద్దడానికి శాయశక్తులా కృషి చేస్తానన్నారు.

ఉగ్రవాదం కేవలం హైదరాబాద్ నగరానికి మాత్రమే సంబంధించిన సమస్య కాదని, ఇది ప్రపంచ వ్యాప్త సమస్య అని ఎకె ఖాన్ అన్నారు. విధి నిర్వహణలో నిస్పక్షపాతంగా వ్యవహరిస్తానని ఆయన అన్నారు. ఖాన్ కు 2007 సంవత్సరంలో రాష్ట్రపతి పోలీసు మెడల్ లభించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+