హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, సతీమణి భువనేశ్వరి సింగపూర్ వెళ్ళనున్నారు. గురువారం రాత్రి లేదా శుక్రవారం తెల్లవారుఝామున ఇక్కడ నుంచి బయలుదేరనున్నారు. ఇంటర్న్‌షిప్‌లో భాగంగా ఆయన కోడలు బ్రాహ్మణి గత కొంతకాలంగా సింగపూర్‌లో ఉంటున్నారు. కొద్ది రోజులపాటు కొడుకు, కోడలుతో కలిసి ఉండేందుకు చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి అక్కడకు వెళ్తున్నారు.
వచ్చే నెలలో అసెంబ్లీ సమావేశాలు, ఇతరత్రా రాజకీయ పరిణామాలు ఉండే అవకాశం ఉండటంతో ఈలోపే వెళ్ళి రావాలని ఆయన భావిస్తున్నారు. అక్కడ మూడు నాలుగు రోజులు ఉండే అవకాశం ఉంది. 'పిల్లలు ఎప్పటి నుంచో గొడవ చేస్తున్నారు. వెళ్ళి రెండు మూడు రోజులుండి వద్దామనుకుంటున్నాను' అని ఆయన బుధవారమిక్కడ పార్టీ నేతలతో చెప్పారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి