West Bengal Post-Poll Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు-ఆ పార్టీదే ఎడ్జ్ -తేల్చేసిన తాజా సర్వే..!

పశ్చిమ బెంగాల్ (west bengal) లో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా సాగినట్లు ఇప్పటికే పలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. రేపు బెంగాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాల ప్రకటించేందుకు ఈసీ సిద్దమవుతోంది. అయితే ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్న ఓటరు తీర్పుపై ఉత్కంఠ నెలకున్న సర్వే సంస్థ పొలిటికల్ క్రిటిక్ తాజాగా బెంగాల్ ఓటర్ల అభిప్రాయాలు సేకరించింది. తమ తాజా పోస్ట్ పోల్ సర్వే ఫలితాలను ఇవాళ షేర్ చేసింది. ఇందులో బెంగాల్ ఎన్నికల్లో హోరాహోరీ పోరు జరిగినట్లు తేలింది.

West Bengal Results 2026: ఎల్లుండే బెంగాల్ ఫలితాలు..! హంగ్ తప్పదా ?
West Bengal Results 2026: ఎల్లుండే బెంగాల్ ఫలితాలు..! హంగ్ తప్పదా ?

పశ్చిమ బెంగాల్లో ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 294 సీట్లు ఉన్న అసెంబ్లీలో అధికార, విపక్షాలైన టీఎంసీ, బీజేపీ మధ్య తీవ్ర పోరు జరిగినట్లు నిర్ధారణ అయింది. ఇందులో టీఎంసీ 149-159 సీట్లు సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని పొలిటికల్ క్రిటిక్ తాజా సర్వే అంచనా వేసింది. అలాగే రెండో స్ధానంలో నిలుస్తున్న బీజేపీకి 132-142 సీట్లు లభించే అవకాశం ఉన్నట్లు తేల్చింది. ఇతరులకు 1-5 సీట్లు లభిస్తాయని పొలిటికల్ క్రిటిక్ అంచనా వేస్తోంది.

West Bengal Post-Poll Survey TMC Projected at 149 159 Seats BJP Close Behind at 132 142
Tamil Nadu Post-Poll Survey: తమిళ తీర్పు క్లియర్-తేల్చేసిన తాజా సర్వే..!
Tamil Nadu Post-Poll Survey: తమిళ తీర్పు క్లియర్-తేల్చేసిన తాజా సర్వే..!

పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా జరిగిన హోరాహోరీ పోరులో అతి స్వల్ప ఆధిక్యాలతో అభ్యర్ధులు గెలువబోతున్నట్లు ఈ సర్వే తేల్చింది. అలాగే ఓట్ల వాటాలో చిన్నపాటి మార్పులు కూడా సీట్ల ఫలితాలను గణనీయంగా మార్చగలవని తెలిపింది. గ్రామీణ, పట్టణ ఓటింగ్ సరళిలో స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తోందని పొలిటికల్ క్రిటిక్ తెలిపింది. మహిళా లబ్ధిదారులైన ఓటర్లు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నారని వెల్లడించింది. ఎగ్జిట్ పోల్స్ సమయంలో చాలా మంది ఓటర్లు సంకోచించినప్పటికీ, ఓటింగ్ తర్వాత మరింత బహిరంగంగా తమ అభిప్రాయాలను పంచుకున్నారని పేర్కొంది. తమది ఎగ్జిట్ పోల్ కాదని పోల్ అనంతర సర్వే మాత్రమేనని తెలిపింది. ఇందులో నమూనా పరిమాణం పరిమితంగానే ఉన్నా క్షేత్రస్థాయిలో ప్రత్యక్ష సంభాషణల ఆధారంగా రూపొందించినట్లు ప్రకటించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+