West Bengal Prediction: బెంగాల్ తీర్పు క్లియర్- ప్రముఖ సెఫాలజిస్ట్ గ్రౌండ్ రిపోర్ట్..!

పశ్చిమ బెంగాల్లో (West Bengal) జరిగిన రెండు దశల అసెంబ్లీ ఎన్నికలు నిన్నటితో ముగిశాయి. అనంతరం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ లో నాలుగు బీజేపీకి అనుకూలంగా, రెండు టీఎంసీకి అనుకూలంగా తీర్పులిచ్చాయి. దీంతో ఇప్పటివరకూ ఉన్న మమతా బెనర్జీ గెలుస్తుందన్న అంచనాలకు భిన్నంగా జనం తీర్పు ఇచ్చారా అన్న సందేహాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో బెంగాల్ లో అసలు ఏం జరిగిందో దగ్గరి నుంచి చూస్తూ వరుసగా విశ్లేషణలు అందిస్తున్న సెఫాలజిస్ట్ పార్దా దాస్ (Partha Das) తన తుది అంచనాలు వెల్లడించారు.

West Bengal: నువ్వు సింగం అయితే నేను పుష్ప- పోలింగ్ వేళ పంచ్ లు..!
West Bengal: నువ్వు సింగం అయితే నేను పుష్ప- పోలింగ్ వేళ పంచ్ లు..!

ముందుగా బెంగాల్ రెండో దశ ఎన్నికలు జరిగిన 142 స్ధానాలకు సంబంధించిన అంచనాలను పార్దా దాస్ వెల్లడించారు. ఇందులో నాదియా జిల్లాలో 17 సీట్లలో టీఎంసీకి 9, బీజేపీకి 8 సీట్లు లభిస్తున్నట్లు తెలిపారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలో టీఎంకీకి 21, బీజేపీకి 12 సీట్లు వస్తున్నాయన్నారు. దక్షిణ 24 పరగణాల జిల్లాలో 31 సీట్లలో టీఎంసీ 28, బీజేపీ 3 సీట్లు గెల్చుకుంటున్నాయి. కోల్ కతా సౌత్ లోని 4 సీట్లలో టీఎంసీ 2, బీజేపీ 2, కోల్ కతా నార్త్ జిల్లాలోని 7 సీట్లలో టీఎంసీ 5, బీజేపీ 2, హౌరా జిల్లాలోని 16 సీట్లలో టీఎంసీ 13, బీజేపీ 3, హుగ్లీ జీల్లాలోని 18 సీట్లవలలో టీఎంసీ 9, బీజేపీ 9, తూర్పు బుర్ద్ వాన్ జిల్లాలోని 16 సీట్లలో టీఎంసీ 13, బీజేపీ 3 సీట్లు గెల్చుకుంటున్నట్లు తేల్చారు. ఇలా రెండో దశలో టీఎంసీ 100, బీజేపీ 42 సీట్లు గెల్చుకుంటున్నట్లు పార్థా దాస్ తెలిపారు.

West Bengal Polls 2026 Partha Das Projects TMC at 180 BJP at 114 Here s What the Numbers Mean
West Bengal Polls: తృణమూల్ కంచుకోటలో బీజేపీ సీట్ల పోరాటం ? వెంటాడుతున్న గతం..!
West Bengal Polls: తృణమూల్ కంచుకోటలో బీజేపీ సీట్ల పోరాటం ? వెంటాడుతున్న గతం..!

తృణమూల్ కాంగ్రెస్ మధ్యతరగతి వర్గాల నుండి భారీ వ్యతిరేకతను ఎదుర్కుంటోందని ఆయన తెలిపారు. బంగాళాదుంప రైతుల్లో టీఎంసీపై ఆగ్రహం ఎక్కువగా ఉందన్నారు. ముస్లిం ఓట్ల ఏకీకరణ, వామపక్ష ఓట్లు (ప్రభుత్వ వ్యతిరేకతను కొంతవరకు అందిపుచ్చుకోవడం), మతువా ఓట్లలో చీలిక ఈ ఎన్నికలలో టీఎంసీ సునాయాసంగా గెలవడానికి దోహదపడుతున్నాయని విశ్లేషించారు. ఈ లెక్కన చూస్తే బెంగాల్ రెండు దశల ఎన్నికలు కలిపితే టీఎంసీ 180 సీట్లు, బీజేపీ 114 సీట్లు గెల్చుకునే అవకాశం ఉందని పార్దాదాస్ విశ్లేషించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+