రేపు తెలంగాణ వైద్య గర్జన: హైకోర్టు అనుమతి

High Court
హైదరాబాద్: రేపు శనివారం మధ్యాహ్నం తెలంగాణ వైద్య గర్జనకు తెలంగాణ మెడికల్‌ ఫోరం సన్నద్ధమవుతోంది. హైకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇవ్వడంతో కోఠి ఉస్మానియా మెడికల్‌ కళాశాల క్యాంపస్‌లో ఆనందోత్సవాలు మిన్నంటాయి. రాత్రంతా సభ నిర్వహణ ఏర్పాట్లలో వైద్యులు, విద్యార్థులు, పారా మెడికల్‌ సిబ్బంది తలమునకలయ్యారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా కొద్ది రోజుల క్రితం ఉస్మానియా మెడికల్‌ కళాశాలలో ఆవిర్భవించిన తెలంగాణ వైద్య ఫోరం జేఏసీ ఇప్పుడు ఉద్యమానికి కేంద్ర బిందువుగా మారింది. తెలంగాణ వాదులు, ప్రజా సంఘాలు, రచయితలు, కవులు, కళాకారులు వివిధ వర్గాల ప్రజలంతా 'తెలంగాణ వైద్య గర్జన' వైపు ఆసక్తి చూపుతున్నారు.

పోలీసు నిర్బంధాన్ని ఎదుర్కొని సభలో పాల్గొనేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా మెడికల్‌ కళాశాలలో అత్యవసర సమావేశాన్ని నిర్వహించి తెలంగాణ వైద్య ఫోరం ప్రతినిధులు ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా ఫోరం కన్వీనర్‌ డాక్టర్‌ బాబురావు, విద్యార్థి ప్రతినిధి డాక్టర్‌ రుక్మారెడ్డిలు మాట్లాడుతూ తెలంగాణ వైద్య గర్జనలో పాల్గొనేందుకు వైద్య విద్యార్థులు, పారా మెడికల్‌ సిబ్బంది వారివారి గుర్తింపు కార్డులను తీసుకొని రావల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ ఉద్యమం కోసం ప్రతి ఒక్కరూ వైద్య గర్జనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కోఠి ఉస్మానియా మెడికల్‌ కళాశాలలో శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు నిర్వహించనున్న తెలంగాణ వైద్య గర్జనకు పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. అదనపు బలగాలను రప్పించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపడుతున్నట్లు సుల్తాన్‌బజార్‌ ఏసీపీ నారాయణ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+