రేపే సిఎం రోశయ్య విశాఖ, శ్రీకాకుళం పర్యటన

Rosaiah
విశాఖపట్నం: ప్రతి శనివారం జిల్లాల్లో పర్యటించాలనుకుంటున్న ముఖ్యమంత్రి కె రోశయ్య రేపటి శనివారం విశాఖ నగరానికి రానున్నారు. ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్‌ నుంచి విమానంలో విశాఖ చేరుకుంటారు. అక్కడే వీఐపీ లాంజ్‌లో 9.45 గంటల వరకు అధికార, అనధికార ప్రముఖలను కలుసుకుంటారు. తరువాత హెలికాప్టర్‌లో బయలుదేరి 10.30గంటలకు శ్రీకాకుళం వెళతారు. అక్కడ ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాత్రికి అక్కడే బసచేస్తారు. 24వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీకాకుళం నుంచి హెలికాప్టర్‌లో బయలు దేరి 10.45 గంటలకు విశాఖ విమానాశ్రయం చేరుకుంటారు.

అక్కడి నుంచి బయలుదేరి 11.45 గంటలకు ప్రభుత్వ అతిథి గృహానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12.45 గంటలకు బయలుదేరి విమానాశ్రయానికి వెళతారు. 1.25 గంటలకు విమానంలో బయలుదేరి హైదరాబాద్‌ వెళతారు. ఇదిలా వుండగా గాజువాకలో సుమారు ఐదు కోట్ల రూపాయలతో నిర్మించిన ఇండోర్‌ స్టేడియాన్ని సీఎం చేతులు మీదుగా ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నట్టు తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+