తెలంగాణ జెఎసి కలిసే ఉంది: ఈటెల రాజేందర్

సిద్ధాంతాలను, పార్టీల జెండాలను పక్కన పెట్టి తెలంగాణ కోసం నాయకులంతా కలసి వచ్చారని, అయితే ఇలా పని చేయడం అంత సులభం కాదని, ఆ పార్టీలకు ముందుకు సాగుతున్న క్రమంలో కొన్ని ఇబ్బందులు ఎదురు కావడం సహజమేనని, వాటిని అధిగమిస్తూ ముందుకు పోతామని ఆయన అన్నారు. తమ పార్టీకి అటువంటి ఇబ్బందులుండవు కాబట్టి సమస్య లేదని, మిగతా పార్టీల నాయకులకు అది అంత సులభం కాదని ఆయన అన్నారు. సభలకు అనుమతి ఇవ్వకపోవడం అత్యవసర పరిస్థితిని తలపిస్తోందని ఆయన విమర్శించారు. ప్రజాస్వామికంగా నిర్వహించుకునే సభలకు అనుమతి ఇవ్వకపోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications